తల్లి లోన్ తీర్చేందుకు సినిమాల్లోకి వచ్చి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు?

praveen

తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య ప్రస్థానం గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న విలక్షణ నటులలో హీరో సూర్య ఒకరు. శివ పుత్రుడు, గజని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సురై పోట్రు, జై భీం చిత్రాల ద్వారా సూర్య తమిళ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సృష్టించుకున్నాడు. ఇక పేరుకి తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా సూర్యకు అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంతో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా స్థాయిలో నటించిన సినిమా 'కంగువ.' ఈ సినిమా త్వరలో రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు సూర్య.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ వచ్చిన సూర్య చాలా ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నాడు. చదువు పూర్తయ్యాక హీరో సూర్య ఓ గార్మెంట్ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యారట. 3 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేయగా ఆయనకు 8 వేల దాకా జీతం వచ్చేదట. ఐతే సూర్య ఫాదర్ కి తెలియకుండా తన తల్లి పాతిక వేలు బ్యాంక్ లోన్ తీసుకున్నారట. ఆ అప్పు తీర్చేందుకు సూర్య తొలి సినిమా చేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. సూర్య నటించిన తొలి సినిమా నెర్రుక్కు నెర్.. ఈ సినిమా ద్వారా వచ్చిన పాతిక వేలు అమ్మకి ఇచ్చానని, అలా మొదలైన ఈ ప్రయాణం లో తనని ఇక్కడిదాకా తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు సూర్య.
ఆ వ్యాఖ్యలు విని సూర్య రియల్ హీరో అని అతని అభిమానులు కొనియాడుతున్నారు. ఇక పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన కంగువ సినిమాను శివ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం విశేషం. సో అలా అమ్మ లోన్ తీర్చేందుకు నటుడిగా మారిన సూర్య పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. ఇక సూర్య మాత్రమే కాదు సూర్య బ్రదర్ కార్తి కూడా తమిళ, తెలుగు భాషల్లో హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈమధ్యనే కార్తి నటించిన సత్యం సుందరం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్టైన సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: