మోషన్ పోస్టర్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టిన ప్రభాస్.. ఏకంగా ఆ విషయంలో నెంబర్ వన్ స్థానం..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మారుతీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాలవిక మోహన్ , రీద్దీ కుమార్ ను ప్రభాస్ కి జోడిగా కనిపించబోతున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ చాలా పోస్టర్ లను విడుదల చేశారు. ఈ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ల ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజా సాబ్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను విడుదల చేసింది.

ఇక ఈ మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా యొక్క మోషన్ పోస్టర్ కి విడుదల అయిన 24 గంటల్లో 6.69 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటివరకు తెలుగు సినిమాల నుండి విడుదల అయిన మోషన్ పోస్టర్లలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన మోషన్ పోస్టర్లలో రాజా సాబ్ మోషన్ పోస్టర్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పవన్ , సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన  బ్రో మోషన్ పోస్టర్ కి 24 గంటల్లో 5.83 మిలియన్ వ్యూస్ దక్కాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్ మూవీ మోషన్ పోస్టర్ కి 24 గంటలో 4.73 మిలియన్ వ్యూస్ దక్కాయి. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మోషన్ పోస్టర్ కి 24 గంటల్లో 4.64 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: