సిల్క్ స్మిత చనిపోయినప్పుడు వచ్చిన ఏకైక స్టార్ హీరో.. ఆయన రాక వెనక అసలు స్టోరీ ఇదే..!
అలా అక్కడ సినిమాలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అలా సిమాల్లో అవకాశాలు తెచ్చుకుని విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఏ అవకాశాన్ని కాదనకుండా చేసుకుంటూ వచ్చింది.. అతి తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ సమయంలోనే తనకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ రాధాకృష్ణను బాగా నమ్మింది. అకౌంట్స్ అన్ని ఆయన చేతుల్లో పెట్టింది. అలా ఆమెను పెద్ద మోసం చేసి.. సిల్క్ స్మితని రోడ్డుపాలు చేశాడు.. ఎంత పేదరికంలో పెరిగిందో సినిమాల్లోకి వచ్చాక అంతటి ఐశ్వర్యాన్ని అనుభవించింది. కానీ రాధాకృష్ణ అనే వ్యక్తి వల్ల దారుణంగా మోసపోయింది. ఆయనకు ఆల్‌రెడీ పెళ్లి అయ్యింది. పిల్లలున్నారు. కానీ సిల్క్ స్మితని గట్టిగా వాడుకున్నారు. చివరి దశలో సినిమా ఆఫర్ల కోసం చాలా మంది మేకర్స్ వాడుకుని వదిలేశారు.
ఇలా వరుసగా మోసాలు చూసిన సిల్క్ స్మిత్. తాగుడుకు బానిసైందని, డిప్రెషన్‌కి గురైందని, దీంతో ఆత్మహత్యకి పాల్పడిందని అంటారు. 1996 సెప్టెంబర్ 23న ఆమె మరణించింది. ఆమె అంత్యక్రియలకు సినిమా వాళ్లు రాలేదని, ఎందరో స్టార్‌లతో నటించిన ఆమెను చివరి చూపు చూడానికి కూడా రాలేదని అంటారు. అయితే ఆమెను కడసారి చూసేందుకు మాత్రం ఒక్క స్టార్ హీరో వచ్చాడట. ఆయన ఎవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన మాత్రమే రావడానికి ఓ కారణం ఉంది. ఆయనతో కలిసి సిల్క్ స్మిత అలిమయ్య అనే సినిమా చేసింది. ఈ మూవీ సమయంలోనే తాను చనిపోతే నువ్వైనా వస్తావా? అని అడిగిందట సరదాకి. ఆ టైమ్‌లో మాటిచ్చాడట అర్జున్. అయితే ఇంత త్వరగా ఇలా అవుతుందని ఊహించలేదు. అందుకే ఆమె చివరి కోరిక నెరవేర్చడం కోసం తాను వచ్చినట్టు అర్జున్ చెప్పడం విశేషం.