మరోసారి హిస్టరీ సృష్టించిన సలార్...?

Anilkumar
తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సలార్ మూవీ థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్  నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులను బద్దలు కొడుతోంది. మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. భారీ వసూళ్లను సాధించి ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ సినిమా గా నిలిచింది అని చెప్పాలి. ఇది ఇలా ఉంటే సౌత్ భాషలతో పాటుగా ఇంగ్లీష్ భాషలో కూడా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ అందుబాటులో తీసుకువస్తే డిస్నీ+ హాట్ స్టార్ వారు హిందీ వెర్షన్ లో ఈ సినిమాను తీసుకువచ్చారు. 

కాగా సలార్ సినిమా ఇందులో బిగ్గెస్ట్ రికార్డ్ ను సృష్టించింది. ఇక డిస్నీ హాట్ స్టార్ లో 250 రోజులు ఇండియా వైడ్ గా ఈ చిత్రం ట్రెండింగ్ లో నిలిచినట్టుగా వారు తెలిపారు.  ఇక దీనితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా హిందీ వెర్షన్ లో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇకపోతే హాట్ స్టార్ లో సలార్ సినిమాతో పాటు కొత్త హిందీ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. కానీ సలార్ సినిమా హిట్ ని సెట్ చెయ్యడం విశేషం అని చెప్పాలి. హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు.

 దీనికి కారణం రెబల్ కు హిందీలో ఉన్న మంచి మార్కెట్. ఓటీటీ లో ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తోంది. అయితే నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హిందీ వెర్షన్ లో సలార్ సినిమా ఎంతటి హిట్ ని సెట్ చేసిందో వారు రివిల్ చేశారు. మొత్తానికి సలార్ మూవీ ఓటీటీ లో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది అని చెప్పాలి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ లాంటి ప్రతిభావంతుల కలయిక వల్లే సలార్ ఇంత పెద్ద విజయం సాధించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ధి రాజా సాబ్ సినిమాతో పాటుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: