దేవర మూవీ వల్లే.. కోట్లు నష్టపోయాం.. నిర్మాత కామెంట్స్ వైరల్?
ఇక వారి సినిమా రామ్ నగర్ బన్నీ ఇటీవల రిలీజ్ చేయగా క్రిటిక్స్ నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఇదే విషయం గురించి ప్రభాకర్ తాజాగా ఓ మీడియా వేదికగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. దేవర సినిమా దెబ్బకొట్టింది.. లేదంటే మా సినిమా కలెక్షన్లు విషయంలో కూడా వెనక్కి తగ్గేది కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అనుకున్నాము. కానీ దేవర సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మా వసూళ్లపై భారీ దెబ్బ పడింది. దాంతో మా సినిమా ఓపెనింగ్స్ కష్టమైంది! కొన్ని రోజుల్లోనే సినిమాను థియేటర్ నుంచి ఎత్తేసారు! అంటూ వాపోయాడు.
అది.. అసలు విషయం. ఇక ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తొలి ప్రెస్ మీట్‌లో ప్రదర్శించిన బాడీ లాంగ్వేజ్‌పై నెటిజన్లు భారీగా ట్రోల్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఆయనకు యాటిట్యూడ్ స్టార్ అనే టైటిల్ కూడా ఇచ్చేసారు. అయితే ప్రభాకర్ దానినే పాజిటివ్ అస్త్రంగా మలుచుకున్నారు. అందుకే యాటిట్యూడ్ స్టార్ అనే టైటిల్ కార్డుని కొడుకు ఎంట్రీలో సినిమాలో వాడుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన రెండు చిత్రాలు కూడా రిలీజ్ సిద్దంగా ఉన్నాయి. మరో సినిమాతో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకొంటారని అంతా భావిస్తున్నారు.