తట్టా బుట్టా సర్దేసిన రకుల్.. ఇక ఇంటికి పయనమేనా..?

Divya
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో గడిచిన కొన్నేళ్లుగా ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం రెండేళ్లుగా ఓ రేంజ్ లో సినిమాలు చేసింది. ఇటీవలె బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీ భగ్నని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. దీంతో ఇక బాలీవుడ్ లోని రకుల్ ప్రీతిసింగ్ సెటిల్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఈ అమ్మడు వేగానికి బ్రేక్ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ఏడాదిలో కేవలం ఆయాలాన్, ఇండియన్-2 చిత్రాలలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ రెండు చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ పరిస్థితి ఏంటో అనే చర్చ కూడా ఇప్పుడు బాలీవుడ్లో మొదలైంది. పూర్తిగా ఈమె కెరియర్ డల్ అయిపోయిందని.. ఇక మీదట రకుల్ ప్రీతిసింగ్ కేవలం తన ఇంటికి పరిమితమవుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా తట్టా బుట్ట సర్దేసింది రకుల్ ప్రీతిసింగ్ అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కేవలం తాను ఇంటి పనులే చేసుకునే సమయం వచ్చిందనే విధంగా కూడా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

కేవలం రకుల్ ప్రీతిసింగ్ చేతులో దే దే ప్యార్ దే -2 చిత్రం మాత్రమే ఉన్నది ఈ సినిమా వచ్చేయేడాది రిలీజ్ కాబోతోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉన్నప్పటికీ.. తన గ్లామర్ తో ఆకట్టుకున్న సినిమాలతో మాత్రం ఆకట్టుకోలేకపోతోంది రకుల్. తన ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎక్కువగా జిమ్ వర్క్ అవుట్ లో చేస్తూ ఉంటుంది ఇటీవల అలాంటి వర్కౌంట్లో చేస్తూ గాయాల పాలయ్యింది రకుల్ ప్రీతిసింగ్. అప్పుడప్పుడు భర్తతో కలిసి వెకేషన్కు వెళ్తూ ఉంటుంది.మరి ఇక మీదట ఆయన రకుల్ ప్రీతిసింగ్ ఆచితూచి సినిమా కథలను ఎంచుకొని ఎంట్రీ ఇస్తుందో లేదో లేకపోతే ఇంటికే పరమితమవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: