మహేష్ బాబుకు యూనిక్ టాలెంట్.. బాక్సాఫీస్ కింగ్‌కు మించి..!!
* టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్ ఒకరు
* స్టోరీ సెలక్షన్స్ లో అతనికి యూనిక్ టాలెంట్
* బాక్సాఫీస్ కింగ్‌కు మించి మంచి పేరు సంపాదించాడు
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
మహేష్ బాబు తెలుగు సినిమాల్లో టాప్ హీరో. ఆయన ఎంచుకునే సినిమాలు చాలా కొత్తగా, ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించే లాగా ఉంటాయి. ఈ టాలీవుడ్ ప్రిన్స్ యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద స్టార్ అయిపోయాడు. 1999లో 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మహేష్ 'మురారి', 'ఒక్కడు' సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఒక్కడు సినిమాలో ఆయన కబడ్డీ ఆటగాడిగా నటించి, ఒక అమ్మాయిని బలవంతపు పెళ్లి నుంచి కాపాడతాడు. ఈ సినిమా భారీ హిట్ అయింది. ఆ తర్వాత 'అతడు', 'పోకిరి' లాంటి సినిమాలు మహేష్ ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. ముఖ్యంగా 'పోకిరి' సినిమా చాలా పెద్ద హిట్. ఈ సినిమాలో ఆయన ఒక సీక్రెట్ పోలీస్‌గా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంతో ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారు.
మహేష్ బాబు చేసిన చాలా సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్ కావడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా అవతరించాడు. ఆయన సినిమాల్లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చాలా పెద్ద హిట్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సాధించింది. ఈ సినిమాని అందరూ అంతగా మెచ్చుకోకపోయినా, మహేష్ బాబు చూడాలనే ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. అలాగే, 'శ్రీమంతుడు' సినిమా కూడా చాలా బాగా ఆడింది. ఈ సినిమాలో మంచి సమాజం గురించి ప్రజలు కృషి చేయాలని చాలా బాగా చూపించారు. ఈ సినిమా దాదాపు రూ.144 కోట్లు సంపాదించింది. ఇంకో సినిమా 'భరత్ అనే నేను'లో మహేష్ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యే పాత్ర చేశారు. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
మహేష్ బాబు సినిమాలు భారీగా కలెక్షన్లు వసూలు చేయడమే కాకుండా ఆ సినిమాలలో మంచి సందేశాలు ఉంటాయి. ఈ సినిమాలు మన సమాజంలోని సమస్యలు, కుటుంబాల గురించి చాలా బాగా చూపిస్తాయి. ఉదాహరణకి, 'మహర్షి' సినిమాలో రైతుల కష్టాలు, గ్రామాల అభివృద్ధి గురించి చాలా బాగా చూపించారు. ఈ సినిమా ప్రేక్షకుల మనసులను బాగా తాకింది. దీంతో మహేష్ బాబు గురించి ప్రజల అభిప్రాయం మరింత మెరుగుపడింది. మహేష్ బాబు సినిమాల్లో కేవలం హీరోగా మాత్రమే కాకుండా, చాలా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటాడు. అందుకే ఆయన సినిమాలు అందరికీ నచ్చుతాయి. మంచి స్టోరీలను ఎంపిక చేసుకునే ఒక యూనిట్ టాలెంట్ మహేష్ కు ఉంది. అది మిగతా హీరోలకు కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు.