అటు తిరిగి ఇటు తిరిగి ఆ లిస్టులో చిరంజీవి ఒక్కడే మిగిలాడా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. ఈయన కథ రచయితగా పని చేసిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలు అందుకోవటంతో ఈయనకు కథ రచయితగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అయినా మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ తో ఈయనకు దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈయన శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను అనే సినిమాలకు దర్శకత్వం వహించి వరుస విజయాలను అందుకున్నాడు. అలా వరుస విజయాలతో ఫుల్ జోష్లో కెరీర్ ను ముందుకు సాగించిన ఈ దర్శకుడు కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి అపజయాన్ని అందుకుంది. ఈ మూవీ అపజయం సాధించడంతో ఆయన ఒకే రకం సినిమాలు చేస్తున్నాడు అని ఆయన నెక్స్ట్ మూవీ లతో కచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని అనేక వార్తలు వైరల్ అయ్యాయి.

ఇకపోతే ఆచార్య లాంటి భారీ ఫ్లాప్ తర్వాత ఈ దర్శకుడు దేవర అనే సినిమాను రూపొందించాడు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో ఈ మూవీ కూడా ఆచార్య లాగానే అవుతుంది అనే అభిప్రాయాలను కూడా కొంత మంది వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో కొరటాల కెరియర్లో ఫ్లాప్ లిస్టులో కేవలం చిరంజీవి మాత్రమే మిగిలినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: