నందమూరి బాలకృష్ణ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. అది ఎలా అనుకుంటున్నారా .? అసలు విషయం లోకి వెళితే ... నందమూరి బాలకృష్ణ కోసం కొన్ని సంవత్సరాల క్రితం దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ స్టోరీ ని తయారు చేశాడట. ఇక స్టోరీ మొత్తం పూర్తి అయిన తర్వాత దానిని బాలకృష్ణ కు వినిపించాడట. స్టోరీ మొత్తం విన్న బాలకృష్ణ కథ సూపర్ గా ఉంది. కాకపోతే నేను ఇలాంటి కథలను ఇప్పటికే చాలా చేసేసాను. మళ్లీ చేస్తే ఈ మూవీ జనాలకు నచ్చే అవకాశాలు ఉండే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. అందుకు నేను ఈ కథతో సినిమా నేను చేయలేను అని అన్నాడట.
ఇక ఆయన రిజెక్ట్ చేసిన స్టోరీ ఏదో కాదు అదే సింహాద్రి. ఇక బాలయ్య దానిని రిజెక్ట్ చేయడంతో విజయేంద్ర ప్రసాద్ ఆ కథను పక్కన పెట్టేసాడట. ఇక రాజమౌళి కి ఆ స్టోరీ అద్భుతంగా నచ్చడంతో ఆ కథ తో జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాడట. దానితో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించి ఆ కథను ఆయనకు వివరించగా ఆయన కూడా ఆ కథతో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించడానికి ఓకే చెప్పాడట. ఆ తర్వాత ఆ సినిమా స్టార్ట్ కావడం , ఫుల్ స్పీడ్ గా పూర్తి చేయడం జరిగిందట. ఇక విడుదల అయ్యాక ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కి రాజమౌళి కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇలా బాలకృష్ణ కోసం విజయేంద్ర ప్రసాద్ ఓ కథను తయారు చేయగా దానిని బాలయ్య రిజెక్ట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆ కథతో రాజమౌళి సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇన్ డైరెక్ట్ గా బాలయ్య వల్ల జూనియర్ ఎన్టీఆర్ కి బ్లాక్ బాస్టర్ దక్కినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.