ప్రభుదేవా : అర్థగంటలో కొరియోగ్రఫీ చేసి నేషనల్ అవార్డు ఎగరేసుకేళ్ళాడు..?

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన డాన్స్ కొరియో గ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న వారిలో ప్రభుదేవా ఒకరు. ఈయన అతి చిన్న వయసు నుండే సినిమా పాటలకు డాన్స్ కొరియో గ్రాఫర్ గా వ్యవహరిస్తూ అద్భుతమైన స్థాయికి ఎదిగాడు. ఇకపోతే ఈయన ఒక పాట కోసం కేవలం అర్ధ గంట మాత్రమే కష్టపడి కొరియో గ్రఫీ చేయగా ఆ సాంగ్ కి ఏకంగా నేషనల్ అవార్డు దక్కిందట. అందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రభుదేవా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్య అనే సినిమాలో హీరో గా నటించాడు.

ఫర్హాన్ అక్బర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా లోని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేయడం కోసం ప్రభుదేవా డేట్ లను దాదాపు ఒక సంవత్సరం ముందే ఈ మూవీ యూనిట్ వారు తీసుకున్నారట. ఇకపోతే ఈ సినిమా లోని మై ఐసా క్యున్ హూన్ అనే సాంగ్ అప్పట్లో జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటకు గాను ఆ  సంవత్సరం ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరీలో ప్రభుదేవా కు జాతీయ చలనచిత్ర అవార్డు కూడా దక్కింది.

అయితే ఈ పాట కోసం ప్రభుదేవా మరియు అతని టీం కేవలం అర్ధ గంట మాత్రమే కొరియో గ్రఫీ చేసి దీనిని పూర్తి చేసిందట. ఇక అర్థ గంట పాటు కష్టపడి కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు నేషనల్ అవార్డు వచ్చింది అనే విషయాన్ని ఓ మీడియా వేదికగా ప్రభుదేవా తాజాగా పంచుకున్నాడు. ఇకపోతే ప్రభుదేవా కేవలం సినిమా పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేయడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో నటించి నటుడి గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: