తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన స్టార్ హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితమే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ నటించాడు.
తండ్రి పాత్రలో నటించిన విజయ్ కి జోడిగా స్నేహ నటించగా ... కొడుకు పాత్రలో నటించిన విజయ్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా తమిళనాడు ప్రాంతంలో భారీ కలక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈయన ఆఖరుగా ఓ సినిమా చేసి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా ఈయన కొన్ని రోజుల క్రితమే తలపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా తర్వాత విజయ్ మరో మూవీ కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం విజయ్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేయబోతున్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే గతంలో విజయ్ , అట్లీ కాంబినేషన్లో తేరి , మేర్సెల్ , బిగిల్ అనే మూడు సినిమాలు రూపొందాయి. ఈ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.