సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సినిమాలు భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భంలో నిర్మాతలకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలా నష్టాలు వచ్చిన సందర్భాలలో ఎక్కువ శాతం హీరోలు తమ రెమ్యూనిరేషన్ నుండి తీసుకున్న మొత్తాన్ని కానీ కొంత భాగాన్ని కానీ తిరిగి నిర్మాతలకు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక హీరోయిన్లలో చాలా తక్కువ మంది ఈ పని చేస్తూ ఉంటారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయి రేంజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత కూడా తాను నటించిన సినిమాకు భారీ ఎత్తున నష్టాలు రావడంతో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ను తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... సమంత కొంత కాలం క్రితం శాకుంతలం అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇక భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
ఈ మూవీ ద్వారా నిర్మాత దిల్ రాజుకు పెద్ద మొత్తంలోనే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. అలా సమంత తాను నటించిన సినిమా ద్వారా నిర్మాత కు భారీ అతని నష్టాలు రావడంతో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ నుండి కొంత భాగాన్ని తిరిగి మళ్ళీ నిర్మాత కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా శాకుంతలం సినిమా ఫ్లాప్ అయ్యి నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టాలు రావడంతో తాను తీసుకున్న పారితోషకం నుండి కొంత భాగాన్ని తిరిగి ఇచ్చి తన గొప్ప మనసును సమంత చాటుకున్నట్లు తెలుస్తుంది.