ఎదవలకంటూ...ఐఫా అవార్డ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గుభాయ్..!

FARMANULLA SHAIK
ఇండియ‌న్ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా  అవార్డుల వేడుక యూఏఈ రాజ‌ధాని అబుదాబి వేదిక‌గా  అట్టహాసంగా జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, కోలీవుడ్ నుంచి న‌టులు హాజ‌రై సంద‌డి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఏఆర్‌ రెహమన్‌, వెంకటేశ్‌, బాలకృష్ణ, సమంత, రానా త‌దిత‌రులు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఇక ఈ వేడుక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. ఐఫా 2024కు గాను ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గ‌జం లిరిక్ రైట‌ర్ జావేద్ అక్త‌ర్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు. కోలీవుడ్ దిగ్గ‌జం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పొన్నియిన్‌ సెల్వన్ చిత్రం ఏకంగా ఏడు అవార్డుల‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సూపర్ హిట్ కన్నడ సినిమా `కాటేరా`లో నటించిన జగపతి బాబు బెస్ట్ విలన్ అవార్డును సొంతం చేసుకున్నాడు.ఇదిలావుండగా అవార్డుల గురించి నటుడు జగపతి బాబు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత పవర్ఫుల్ విలన్ పాత్రలు చేస్తూ వస్తున్నారు.అందులో భాగంగానే కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో సైతం పవర్ఫుల్ విలన్ గా అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో జరిగిన ఐఫా 2024 అవార్డుల కార్యక్రమంలో ఆయనకు బెస్ట్ విలన్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకునేందుకు దుబాయ్ వెళ్లిన ఆయన అక్కడ రికార్డు చేసిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి అంటూ సరదాగా కామెంట్ చేశాడు. కానీ దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. అవార్డులు మీద ఆయనకు సరైన అభిప్రాయం లేకపోవడంతోనే అలా కామెంట్ చేసి ఉండవచ్చని కొందరు కామెంట్ చేస్తుంటే అవార్డుల మీద సరైన అభిప్రాయం లేకపోతే ఆ దుబాయ్ వరకు అయినా ఎందుకు వెళ్లారు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: