రామ్ చరణ్ కొన్న కొత్త కారు నంబర్ ఇదే.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?

Divya
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు. రామ్ చరణ్ ఇటీవలే ఖైరతాబాద్ లోని ఆర్టీవో ఆఫీస్ కి తన కొత్త కారు నెంబర్ తీసుకోవడానికి వచ్చినట్లుగా గత కొన్ని గంటలుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి అక్కడ ఫోటో దిగి మరి సంతకం చేసినట్లుగా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే రామ్ చరణ్ రిజిస్ట్రేషన్ చేయించిన TG 09 -2727 అనే నెంబర్ వెనుక కారణం ఏంటి అనే విషయం పైన ఇప్పుడు ఒక విషయం వైరల్ గా మారుతున్నది.

రామ్ చరణ్ ఆర్టీవో కార్యాలయానికి రావడంతో పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు రావడం జరిగింది. రామ్ చరణ్ దగ్గర ప్రస్తుతం ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి  తాజాగా రోల్స్ రాయిస్  బ్రాండ్ నుంచి మరో లగ్జరీకారు ను తెచ్చుకున్నారు . రామ్ చరణ్ తండ్రి చిరంజీవి దగ్గర వైట్ కలర్ కారు ఉండగా రామ్ చరణ్ తాజాగా మరొక కారును కొనుగోలు చేశారు. దీని ధర సుమారుగా రూ .7 కోట్లకు పైగా ఉంటుందట. రోల్స్ రాయిస్ కారు కస్టమర్ యొక్క ప్రొఫైల్ సమాజంలో ఆ వ్యక్తి యొక్క స్థాయి వివరాలను బట్టి ఇస్తుంది.

అయితే రామ్ చరణ్ తన కార్లకు 27 నెంబర్ ఎందుకు తీసుకుంటారు అంటే అది తన లక్కీ నెంబరట.అంతే కాకుండా తన పుట్టినరోజు కూడా 27 నెంబర్తో కలిసి వస్తుంది కాబట్టి అందుకే ప్రతి కారకు కూడా అలానే నెంబర్ వచ్చేలా చూసుకుంటారట రామ్ చరణ్. రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. కియారా అద్వానీ, అంజలి, సునీల్, తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: