ఉప్పు, పప్పుకి కూడా అప్పు చేశాడా.. ఒకప్పుడు రాజమౌళి దుస్థితి గురించి తెలుసా?

praveen
ఇండియన్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఇక్కడ ప్రేత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. రాజమౌళి సినిమాకు అన్నీ తానే అయ్యి తెరకెక్కిస్తారు. అందుకే అతని సినిమాలో ఎంతటి పెద్ద సూపర్ స్టార్లు ఉన్నా, సినిమా క్రెడిట్ మొత్తం ఆయనికే దక్కుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సినిమానే ఆయన ప్రపంచంలాగా మలుచుకున్నారు. అందుకే రాజమౌళిని జక్కన్న అని సరదాగా పిలుస్తూ ఉంటారు. ఇక అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి.. బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసారు. వందల కోట్ల బడ్జెట్ తో మూవీ నిర్మించడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. కానీ రాజమౌళికి ఉన్న డిమాండ్ రీత్యా సినిమాకు వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు క్యూలు కడతారు. అలాంటిది రాజమౌళి ఒకప్పుడు కూటికి కూడా ఇబ్బంది పడ్డారనే విషయం మీకు తెలుసా?
రిచెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరిగా వెలుగొందుతున్న రాజమౌళి ఒకప్పటి జీవితం తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. నిత్యావసర సరుకులకు అప్పు చేయాల్సిన పరిస్థితిలో అత్యంత పేదరికం రాజమౌళి కుటుంబం అనుభవించిందట! ఈ విషయం రాజమౌళి ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించడం గమనార్హం. జీవితంలో మీకు ఎదురైన అవమానాలు ఏమిటని సదరు యాంకర్ అడగ్గా.. "మేము చెన్నైలో ఉన్న రోజుల్లో నాన్న ఘోస్ట్ రైటర్ గా పని చేసేవారు. ఈ ఘోస్ట్ రైటర్స్ కి ఎప్పుడో ఒకసారి గానీ డబ్బులు వచ్చేవి కావు. ఆ డబ్బులు వచ్చినప్పుడు కిరాణా కొట్టులో చేసిన అప్పులు తీర్చేవాళ్ళం. కిరాణావాడు రూ. 100-150 రూపాయల అప్పు వరకు బాగానే ఇచ్చేవాడు. కానీ, ఆ తరువాత మాత్రం విసుక్కునేవాడు. అలా ఒకరోజు నేను కూరగాయల కోసం దుకాణానికి వెళ్ళాను. అక్కడ వాడు ఏదో పనిలో బిజీగా ఉండేవాడు. నేను ఒకటికి రెండు సార్లు... అన్నా నాకు వెంటనే ఇవ్వు అని అడుగుతున్నాను. దాంతో వాడు 'పోరా' అని అరిచాడు. అప్పుడు నాకు చాలా అవమానం అనిపించింది." అంటూ అప్పటి విషయాన్ని చెప్పుకొచ్చాడు.
అలాంటి రాజమౌళి నేడు వందల కోట్ల రూపాయిల సినిమాలను తెరకెక్కిస్తున్నాడు అంటే ఇది నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎస్ఎస్ఎంబి 29 యాక్షన్ అడ్వెంచర్ డ్రామా దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు సదరు నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు పని చేయనున్నారని వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: