సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీలను మరొకరు చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొంత మంది తమ దగ్గరకు వచ్చిన స్టోరీలను ఆ కథ నచ్చక రిజక్ట్ చేస్తే , మరి కొంత మంది ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాలలో సినిమా కథ అద్భుతంగా నచ్చిన అవి మా స్థాయికి సరిపోవు. అలాంటి సినిమాలు మేము చేయడం వల్ల ఆ కథ పాడైపోతుంది. అనవసరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతుంది అనే ఉద్దేశంతో స్టార్ హీరోలు కొన్ని కథలను వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ మూవీ కథ అద్భుతంగా నచ్చిన కూడా ఆ సినిమా తనపై వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో వదిలేసాడట. ఆ సినిమా ఏది..? ఆ వివరాలు ఏమిటి తెలుసుకుందాం. కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ... సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన బొమ్మరిల్లు సినిమా కథను మొదట నాకే చెప్పారు. ఆ సినిమా కథ నాకు అద్భుతంగా నచ్చింది. కానీ ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు , మాస్ డైలాగులు లేవు.
అలాంటి కథ నాపై రూపొందిస్తే పెద్దగా వర్కౌట్ కాదు. నా సినిమాకు వచ్చే ప్రేక్షకులు అంతా కూడా సినిమాలో యాక్షన్ సన్నివేశాలు , భారీ డైలాగులు ఉండాలి అని అనుకుంటారు. అలాంటి అంచనాలతో థియేటర్‌కి వచ్చిన వారికి అవేమీ లేకపోతే ఆ సినిమా వారికి నచ్చదు. ఆ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా ఆ కథతో రూపొందే సినిమా ఫ్లాప్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ సినిమాను రిజెక్ట్ చేశాను అని జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే బొమ్మరిల్లు సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.