పొట్టేల్ : చిన్న సినిమాకు పెద్ద రెస్పాన్స్.. ఆ థియేటర్లో మొత్తం టికెట్లు అవుట్..?

Pulgam Srinivas
యువ చంద్ర హీరోగా అనన్య నాగళ్ళ హీరోయిన్గా సహిత్ మోతుకూరి దర్శకత్వంలో పొట్టెల్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ 25 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్
 అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ యూనిట్ వరుసగా ప్రచారాలను పెద్ద ఎత్తున చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా హీరోయిన్ అయినటువంటి అనన్య నాగళ్ళ ఏకంగా ఫ్లైట్ లోనే ప్రచారాలను నిర్వహించింది.
 
ఇలా కొత్త రకంగా ఈ బ్యూటీ ఈ సినిమా ప్రచారాలను చేయడంతో ఒక్క సారిగా ఈ సినిమా ప్రచారాలకి సంబంధించిన న్యూస్ కూడా వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 25 వ తేదీన విడుదల చేయనుండగా అంతకు రెండు రోజుల ముందే అనగా అక్టోబర్ 23 వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షో లను ప్రదర్శించడానికి మూవీ బృందం డిసైడ్ అయింది. అందులో భాగంగా అక్టోబర్ 23 వ తేదీన ఏ ఏ ఏ సినిమాస్ , ఏ ఎం బి థియేటర్ ఎంలలో ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ బుకింగ్స్ ను కూడా మూవీ యూనిట్ ఓపెన్ చేసింది. ఇకపోతే ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ రెండు థియేటర్లలో ఈ సినిమా మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కు సంబంధించిన టికెట్లు మొత్తం సోల్డ్ అవుట్ అయినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.
ఇలా ఈ చిన్న సినిమాకు ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ కి మంచి టాక్ వస్తే ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ , తర్వాత భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: