' దేవ‌ర ' రికార్డుల మోత‌... ఆల్బ‌మ్ మ‌రో సెన్షేష‌న‌ల్ రికార్డ్ ...!

RAMAKRISHNA S.S.
- దేవ‌ర ఖాతాలో మ‌రో స‌రికొత్త రికార్డ్‌
- స్పాటిఫైలో దేవర ఆల్బమ్ 100 మిలియ‌న్ల స్ట్రీమింగ్‌
- అటు క‌లెక్ష‌న్ల‌లోనూ రు. 530 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమా గ‌త నెల 27న థియేట‌ర్ల లోకి రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే రు. 530 కోట్ల కు పైగా వ‌సూళ్లు సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి సంగీతం అందించిన అనిరుద్ ర‌విచంద్ర‌న్ ప‌ని భారీ ప్లస్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే సినిమా రిలీజ్ అయ్యాక మ్యూజిక్ విష‌యంలో అనిరుధ్ ర‌విచంద్ర‌న్ వర్క్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇక అనిరుధ్ దేవ‌ర సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటుగా తాను ఇచ్చిన నాలుగు పాటలు కూడా సినిమా లో పెద్ద హిట్ అయ్యాయి. అయితే మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ స్పాటిఫైలో దేవర ఆల్బమ్ ఓ రికార్డ్ న‌మోదు చేసింది. దేవ‌ర ఆల్బ‌మ్ ఓ సంచలన రికార్డు సెట్ చేసింది. మరి కేవలం నాలుగు పాటలు కలిగిన ఈ ఆల్బమ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్స్ ని దాట‌డం అంటే మామూలు సెన్షేష‌న‌ల్ కాద‌ని చెప్పాలి. ఇది కూడా మన తెలుగు నుంచి ఫాస్టెస్ట్ రికార్డు గా నిలిచింది. ఏదేమైనా దేవ‌ర ఇప్ప‌టికే ఎన్నో స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలోనే మ‌రో అదిరిపోయే రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: