నిర్మాతగా నితిన్.. హీరోగా వెంకటేష్.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా?

praveen
విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. 90వ దశకంలో వెంకటేష్ ప్రేమకథా చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. మరి ముఖ్యంగా నిన్నటి తరం మహిళలు వెంకీ సినిమా వస్తుందంటే, కుటుంబంతో కలిసి థియేటర్లకు ఎగబడేవారు. ఇక ఫ్యాన్ బేస్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు వెంకీ సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా వెంకటేష్ సినిమాలో కుటుంబంతో కలిసి కూర్చొని చూసేవిగా ఉండటం వలన, ఆయన సినిమాలకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. అది నేటికీ కొనసాగుతుండడం నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి.
అయితే నిన్న మొన్నటి వరకు మంచి స్పీడ్ మీద సినిమాలు చేసిన వెంకటేష్ గత కొంతకాలంగా అరుదుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. సంవత్సరం క్రితం 'సైంధవ్' సినిమాతో పలకరించిన వెంకటేష్ తాజాగా ఓ రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టినట్టు సమాచారం. అందులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా తాజాగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా వెంకీ కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. అందులో ఒక సినిమాకు యంగ్ హీరో నితిన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు టిఎన్ సంతోష్ దర్శకత్వం వహించబోతున్నట్టు తాజాగా మూవీ మేకర్స్ ప్రకటించారు. దాంతో ఈ సినిమా పైన సర్వత్ర అంచనాలు నెలకొన్నాయి.
దర్శకుడు సంతోష్ ఈ సినిమాను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ కథ చెప్పిన వెంటనే విక్టరీ వెంకటేష్ క్షణాల్లో ఓకే చేశాడని అంటున్నారు. ఇటువంటి కధాశంతో కూడిన చిత్రాలు వెంకటేష్ కు చాలా బాగా సూట్ అవుతాయి. మరి ముఖ్యంగా వెంకీ పోలీసు పాత్రలు చేసిన సినిమాలు ఆయన సినిమా కెరీర్ లోనే చాలా స్పెషల్ గా నిలిచాయి. దానికి ఉదాహరణగా ఘర్షణ అనే సినిమాను గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో వెంకీ చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జనాలను అలరించాడు. ఇక తాజా కాంబోలో అదే రకమైన పాత్రను చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కాంబో పైన మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: