ఆదిత్య 369 లో ద్విపాత్రాభినయం.. 90స్ లోనే ట్రెండ్ సెట్ చేసిన బాలయ్య?

praveen
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. అలాంటిది ఒక స్టార్ హీరో ద్విపాత్రాభినయం చేస్తున్న మూవీ రిలీజ్ అవుతుంది అంటే అబ్బో అది అభిమానులకు పండగే. ఒక పాత్రలో కనిపిస్తేనే చూసి తెగ మురిసిపోయే అభిమానులు.. ఇక ఒకే సినిమాలో రెండు పాత్రల్లో తమ అభిమాన హీరో కనిపించడంతో ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇక ఇలా ఇప్పటివరకు ఎంతో మంది హీరోలు ద్విపాత్రాభినయం ప్రయత్నించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు.

 అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ.. కెరియర్ లో కూడా ఇలాంటి ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఇక బాలయ్య అభిమానులందరికీ ఎవర్ గ్రీన్ గా నిలిచే మూవీ ఏదైనా ఉంది అంటే అది ఆదిత్య 369. ఇప్పట్లో టైం ట్రావెల్ ని హ్యాండిల్ చేయడం కష్టమే. ఇక అలాంటి సినిమాను చేసి ప్రయోగం కూడా చేయలేమని దర్శకులు హీరోలు చేతులెత్తేస్తున్నారు. కానీ 90స్ లోనే బాలయ్య ఇలాంటి టైం ట్రావెల్స్ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

 హెచ్జి వెల్స్ 1895 టైం ట్రావెల్ నవల స్ఫూర్తితో ఆదిత్య 369 సినిమాను సింగిటం శ్రీనివాసరావు తెరకెక్కించారు  ఈ మూవీలో మాడ్రన్ యుగంలో బ్రతికే ఒక యువకుడి పాత్రతో పాటు ఏకంగా శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఈ రెండు పాత్రలోనూ తన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేశాడు. ఇక బాలయ్య కెరియర్ లో ఇదొక మైలు రాయి లాంటి సినిమాగా నిలిచిపోయింది. ఇక బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అని చెప్పాలి. అందుకే ఇక్కడ ఈ సినిమా తర్వాత బాలయ్య ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసినప్పటికీ ఇక నందమూరి అభిమానులకు మాత్రం ఆదిత్య 369 అనేది ఒక ఎవర్గ్రీన్ మూవీ గా నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: