టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమై న స్థాయి కలిగిన స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు . మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే అద్భుతమైన స్థాయికి చేరుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇక ఓ వైపు చిరంజీవి , మరో వైపు చరణ్ ఇద్దరు కూడా తమ తమ సినిమాల తో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు . ఇకపోతే ఓ దర్శకుడు మాత్రం ఇటు చిరంజీవి కి , అటు చరణ్ కి ఇద్దరికీ కూడా ప్లాపులను ఇచ్చాడు. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీను వైట్ల అందరివాడు అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చిరు డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ, మరొక పాత్రలో కొడుకుగానూ నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే శ్రీను వైట్ల అందరివాడు సినిమా తర్వాత చాలా సంవత్సరాలకే చిరంజీవి కుమారుడు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బ్రూస్ లీ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో చిరంజీవి కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. శ్రీను వైట్ల ఇలా అందరివాడు సినిమాతో చిరంజీవి కి ఓ అపజయాన్ని అందించగా , ఆ తర్వాత బ్రూస్ లీ అనే సినిమాతో చరణ్ కి ఓ అపజయాన్ని అందించాడు.