రజనీకి అస్సలు కలిసి రాని ఆ బ్యానర్.. నాలుగు సినిమాలతో అలాంటి అనుభవం..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అదిరిపోయా రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే రజనీ కాంత్ ఇప్పటివరకు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాలుగు సినిమాల్లో నటించాడు. మరి రజనీ కాంత్ హీరోగా రూపొందిన సినిమాలలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఆ నాలుగు సినిమాలు ఏవి ..? వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు మొదటగా సూపర్ స్టార్ రజనీ కాంత్ తో రోబో 2.0 అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక లైకా ప్రొడక్షన్స్ వారు రజనీ కాంత్ తో రెండవ సినిమాగా దర్బార్ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ కి మురుగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వీరి కాంబో లో లాల్ సలామ్ అనే సినిమా వచ్చింది. 

ఈ సినిమా భారీ డిజాస్టర్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక తాజాగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు రజినీ కాంత్ హీరో గా టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయన్ అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో ప్రదర్శించబడుతుంది. మరి వీరి కాంబో లో రూపొందిన నాలుగో సినిమా అయినటువంటి వెట్టయన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: