పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అకిరా ఎంట్రీ ఆ సినిమాతోనే..?

Divya
మెగా కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చాలామంది మాత్రం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా ఎంట్రీ కోసమే వెయిట్ చేస్తున్నారు. కానీ ఆకీరా మ్యూజిక్ పైన చాలా ఇంట్రెస్ట్ గా  ఉన్నాడంటూ గతంలో రేణు దేశాయ్ కూడా తెలియజేయడం జరిగింది.. కానీ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరాను హీరోగా చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎంట్రి ఇస్తారా అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం అఖీరా అయితే చదువుకుంటున్నారని తన పెదనాన్న చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది.. అలాగే తన తండ్రి నటిస్తున్న ఓజీ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో అకిరా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓజీ చిత్రంతోనే అఖీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

డైరెక్టర్ సుజిత్ కూడా అకిరా ఎంట్రీ కోసం సరైన ప్లాన్ గీశారని సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్లు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఓజి చిత్రంలో పవన్ కళ్యాణ్ చైల్డ్ యాక్టర్ పాత్రని అఖీరా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ విషయం వైరల్ గా మారడంతో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓరేంజ్ లో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అని చెప్పవచ్చు. మరి ఏది ఏమైనా ఇప్పుడు వస్తున్న వార్తలు నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో విషయంలో కూడా బిజీగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: