నందమూరి నటసింహం బాలకృష్ణ ,బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాలయ్యకి బోయపాటి వరుసగా మూడు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించాడు.దీనితో బాలయ్య,బోయపాటి కాంబో లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఉంటాయి.బోయపాటి యాక్షన్ ఎపిసోడ్స్ బాలయ్యకి సెట్ అయినట్టుగా ఏ హీరోకి అంతగా సెట్ కావు.అందుకే బోయపాటి సినిమా అంటే బాలయ్య హీరోగా ఉండాల్సిందే అనే అంతగా వీరి కాంబో గుర్తింపు సాధించింది.ఇదిలా ఉంటే బోయపాటి బాలయ్యతో గతంలో చేసిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కరోనా మహమ్మారి మూలంగా థియేటర్స్ మూతబడి సిట్యుయేషన్ చాలా క్రిటికల్ గా వున్న సమయంలో రిలీజ్ అయిన బాలయ్య అఖండ మూవీ ఊహించని విజయం సాధించి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడంలో ఎంతగానో సక్సెస్ అయింది.ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ లభించింది..
దీనితో గత కొన్నాళ్లుగా అఖండ సినిమాకు సీక్వెల్ కావాలని దర్శకుడు బోయపాటిని బాలయ్య ఫ్యాన్స్ అడుగుతున్నారు.అయితే బోయపాటి రీసెంట్ మూవీ స్కంద సినిమా ఊహించని విధంగా ప్లాప్ అయింది.దీనితో బోయపాటి మళ్ళి బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే బాలయ్య తో సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు.దీనితో ఫ్యాన్స్ కోరిక మేరకు బోయపాటి బాలయ్య అఖండ మూవీ కి సీక్వెల్ గా అదిరిపోయే స్టోరీ ని సిద్ధం చేసాడు.అనుకున్నట్లుగానే బాలయ్యతో తన నాలుగో సినిమాను మొదలు పెట్టాడు.బాలయ్య బోయపాటి కాంబో లో వచ్చే నాలుగో మూవీకి అఖండ (తాండవం) 2 అనే టైటిల్ ఫిక్స్ చేసారు.తాజాగా ఈ సినిమాను మేకర్స్ ఘనంగా ప్రారంభించారు.. అంత బాగానే వుంది కానీ అఖండ సీక్వెల్ బడ్జెట్ విషయమే బాలయ్య ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెడుతుంది.బోయపాటి కేవలం యాక్షన్ సీన్స్ కోసమే భారీగా ఖర్చు చేయిస్తాడు.తాజాగా ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురే ప్రొడ్యూసర్ కావడంతో బడ్జెట్ లిమిటేషన్ ఉండదు.దీనితో బడ్జెట్ విషయంలో బోయపాటి కాస్త జాగ్రత్త వహించాలని బోయపాటికి బాలయ్య ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 100 కోట్ల పైనే ఉండనున్నట్లు సమాచారం.