దారుణమైన పరిస్థితికి బిగ్ బాస్ తెలుగు.. చరిత్రలో తొలిసారి అంత తక్కువ టిఆర్పి రేటింగ్..?

Pulgam Srinivas
తెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ బుల్లి తెరపై ఏడు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ ప్రదర్శితం అవుతుంది. తెలుగులో ఓ టి టి లో బిగ్ బాస్ ఒక సీజన్ కంప్లీట్ అయింది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ మొదటి సీజన్ కు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక అప్పటి నుండి జరిగిన ప్రతి సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఎనిమిదవ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే బిగ్ బాస్ బుల్లి తెర ఆరవ సీజన్ కి చాలా తక్కువ టి ఆర్ పి రేటింగ్ వచ్చినట్లు అనేక కథనాలు ఆ సమయంలో వచ్చాయి. దానితో ఏడవ సీజన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిగ్ బాస్ బృందం అనేక కొత్త కొత్త టాస్కులను ఏడవ సీజన్లోకి తీసుకు వచ్చింది. దానితో ఏడవ సీజన్ కి భారీ గానే టి ఆర్ పి రేటింగ్ పెరిగింది. మళ్లీ 8 వ సీజన్ కి టి ఆర్ పి రేటింగ్ క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 లోని కొన్ని ఎపిసోడ్లకి 3.50 నుండి 4 టి ఆర్ పి రేటింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇంత తక్కువ టి ఆర్ పి రేటింగ్ అనేది బిగ్ బాస్ కు చాలా చెడ్డ విషయం అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. నిజంగానే బిగ్ బాస్ సీజన్ 8 కి ఎంత తక్కువ టి ఆర్ పి రేటింగ్ వస్తే దానికి ప్రధాన కారణం రొటీన్ గేమ్ షో లే అని కొంత మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: