మొదటి వారం పర్వాలేదనిపించిన విశ్వం.. ఇంకా అన్ని కోట్లు రాబడితేనే హిట్..?

Pulgam Srinivas
మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా విశ్వం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి మొదటి వారం రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ ఫార్ములా కు ఈ మూవీ ఇంకా ఎన్ని కోట్ల దూరంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.13 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి ఈ వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.13 కోట్ల షేర్ ... 9.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి వారం రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ లలో కలుపుకొని 61 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా వారం రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 5.74 కోట్ల షేర్ ... 10.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ దాదాపు పది కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ లోకి దిగినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం చూసినట్లయితే ఈ మూవీ మరో 4.25 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ లో గోపీచంద్ కి జోడిగా కావ్య దాపర్ నటించగా ... శ్రీను వైట్ల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc

సంబంధిత వార్తలు: