అసలైన స్పీడ్ చూపిస్తున్న పవన్.. గంటలోనే ఆ సన్నివేశాలు మొత్తం పూర్తి..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ సినిమా అనేక సార్లు షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగును మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" సినిమాపై ఇంట్రెస్ట్ చూపడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దానితో క్రష్ కూడా కొందపోలం అనే సినిమాను ఆ గ్యాప్ లో పూర్తి చేశాడు.

ఇక వీరిద్దరి సినిమాలు పూర్తి కావడంతో మళ్ళీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ల హడావిడి స్టార్ట్ కావడంతో పవన్ కళ్యాణ్ ఎలక్షన్లపై దృష్టి పెట్టాడు. దానితో ఈ సినిమా మళ్లీ ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈ సినిమా పూర్తి కాకపోవడంతో క్రిష్ ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు నుండి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాడు. కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు కీలక మంత్రి పదవుల్లో కొనసాగుతున్నాడు. ఇక తాజాగా తిరిగి మళ్ళీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తూ వస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ సాంగ్ షూటింగ్ను ప్రారంభించారట. ఇక దానిని పవన్ కళ్యాణ్ కేవలం గంటలోనే పూర్తి చేశాడట. ఇలా పవన్ హరిహర వీరమల్లు సినిమాను అదిరిపోయే స్పీడ్ గా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: