ప్రియుడితో ఫారెన్ లో ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల.. హోటల్లో ఆ పని చేస్తూ.?

Pandrala Sravanthi
 శ్రీ లీల ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకొని ఇండస్ట్రీలో చాలా తొందరగా ఎదిగిన హీరోయిన్.. శ్రీ లీల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటించిన సినిమాలన్నీ హిట్టే..కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫ్లాపులు వచ్చాయి. అయితే శ్రీలీల నటించిన సినిమాలు ప్లాప్ అయినా కూడా ఆమె హవా తగ్గలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా చాలామంది దర్శక నిర్మాతలు శ్రీలీలను పెట్టుకుంటే బాగుంటుంది అని శ్రీలీలను చూసైనా సినిమా హిట్ అవుతుంది అనే భావన వారిలో ఉంటుంది.ఇక శ్రీలీల తన ఎనర్జీతో  స్టార్ హీరోలను సైతం బీట్ చేస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే శ్రీ లీల ఫారిన్ వెళితే ఎందుకు అంత హైలెట్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. అయితే శ్రీలీల ఒక్కతే కాదు ఆమె తన ప్రియుడితో కలిసి ఫారిన్ ట్రిప్ వేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 

మరి ఇంతకీ శ్రీలీల ఎక్కడికి వెళ్ళింది.. ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు.. అనేది ఇప్పుడు చూద్దాం.. శ్రీలీల కుర్రకారుల గుండెల్లో తన అందంతో గుణపం దింపిన ముద్దుగుమ్మ.. అయితే అలాంటి ఈ హీరోయిన్ తాజాగా ప్యారిస్ లో చక్కర్లు కొడుతుంది.. అయితే శ్రీ లీల తన ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీతో ప్యారిస్ వెళ్ళింది అని అందరూ అనుకోవచ్చు. కానీ శ్రీలీల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటో ద్వారా మరొక అనుమానం కలుగుతుంది అభిమానులకు.అదేంటంటే.. శ్రీ లీల తను షేర్ చేసిన ఫోటోలో ఎవరో ఒక అబ్బాయి తో మాట్లాడుతున్న ఫోటో కనిపించింది.

 అయితే ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఆ ఫోటోలు చూసి ఆ ఫోటోలో ఉన్నది శ్రీలీల బాయ్ ఫ్రెండే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరి కొంతమందేమో అలా యాక్సిడెంటల్ గా మాట్లాడింది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజముందో తెలియదు కానీ శ్రీ లీల ఫారిన్ ట్రిప్ కి వెళ్ళింది ప్రియుడుతోనే అంటూ నెట్టింట్లో పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. మరి చూడాలి ప్రియుడితో శ్రీలీల ఫారిన్ ట్రిప్ అంటూ వస్తున్న వార్తలపై ఈ ముద్దుగుమ్మ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: