బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష అరెస్ట్.. ఏం జరిగిందంటే..?

Divya
ఇటీవలే బిగ్ బాస్ -8 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్జే శేఖర్ భాష రాజ్ తరుణ్ స్నేహితుడు గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఇటీవలే శేఖర్ భాషను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైతం అరెస్టు చేసినట్లుగా సమాచారం. అయితే శేఖర్ భాషను అరెస్టు చేయడానికి ఒక సంచలన కేసులో భాగంగా అతని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 4 గంటల పాటు శేఖర్ భాషను విచారించినట్లు సమాచారం. మరి శేఖర్ బాషా ఏ కేసులో పోలీసులు అరెస్టు చేశారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


ఇటీవలే ప్రముఖ యూట్యూబ్ హర్ష సాయి పైన బాధితురాలు  లైంగిక వేధింపులు వేధించారనే విధంగా కేసు వేయడం జరిగింది.. ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ .2కోట్లు తీసుకొని మోసం చేశారంటూ ఆ యువతి కూడా పోలీసులకు తెలియజేసింది. దీంతో హర్ష సాయి  మీద సెక్షన్ 376,354,328 కింద కేసు కూడా నమోదు చేశారు. అప్పటినుంచి హర్ష సాయి కనిపించకుండా విదేశాలలో ఉన్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేయడంతో ఈ కేసులోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషని అరెస్టు చేసినట్లుగా సమాచారం.

హర్ష సాయి కేసులో శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చారని.. హర్ష సాయి కి మద్దతుగా మాట్లాడడంతో అలాగే బాధితురాలు పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారనే విధంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే శేఖర్ బాషా పైన సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో శేఖర్ బాషాను అరెస్టు చేసినట్లుగా సమాచారం. అందుకు సంబంధించి విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. శేఖర్ భాష గతంలో కూడా రాజ్ తరుణ్, లావణ్య మధ్య వ్యవహారం పైన కూడ తలదూర్చారు.. ఇప్పుడు మరొకసారి మళ్లీ ఇలా చేయడంతో అరెస్టు చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: