జై హనుమాన్ లో హీరో దొరికేసాడు.. తెలుగు హీరో కాదు ఎవరంటే?

praveen
ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలు అటు ఇండియా వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సత్తా చాటుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి కమర్షియల్ హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు కాదు.. ఎలాంటి అంచనాలు లేకుండా కథాకథనాన్ని మాత్రమే నమ్ముకుని విడుదలైన సినిమాలే సెన్సేషన్ విజయాలను సాధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అయినా హనుమాన్ సినిమా కూడా ఒకటి. ఈ మూవీలో భారీ తరాగణం లేదు. స్టార్ హీరో కూడా నటించలేదు.

 ఇక అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి  ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు భారీగానే లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు.. సీక్వల్ గా జై హనుమాన్ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ మూవీలో హీరోగా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ విషయం ఎప్పుడు తెరమీదకి వచ్చినా కొంతమంది స్టార్ హీరోల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు జై హనుమాన్ మూవీ లో హీరో ఫిక్స్ అయ్యాడు అంటూ మరో హీరో పేరు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. అయితే ఈసారి తెలుగు హీరో కాదు ఏకంగా కన్నడ హీరో పేరు తెర మీదకి వచ్చింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోయే జై హనుమాన్ మూవీలో హీరోగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాంతార సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగులోను సెన్సేషన్ విజయాన్ని సాధించాడు రిషబ్ శెట్టి. తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ అటు రిషబ్ శెట్టిని ఈ మూవీలో సెలెక్ట్ చేశాడట. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: