భారీ ధరకి గేమ్ చేంజర్ డిజిటల్ పార్ట్నర్ లాక్.. ఒక్క దెబ్బతో అంతా సెట్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... శ్రీకాంత్ , నవీన్ , చంద్ర , సునీల్ , అంజలి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ ని చాలా రోజుల క్రితం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను డిసెంబర్ 20 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ప్రచారాలను మొదలు పెట్టింది. అందులో భాగంగా రెండు పాటలను కూడా విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ లభించింది.

మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా నుండి టీజర్ మరియు మూడవ పాటను కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అత్యంత భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా విడుదల అయిన కొన్ని వారాల తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: