పుష్ప3... దిమ్మ తిరిగే ప్లానింగ్ తో లెక్కల మాస్టర్..!

Amruth kumar
మరో 50 రోజుల్లో పుష్ప2 ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. డిసెంబర్ 6న పుష్పరాజ్ థియేటర్లో సందడి చేయబోతున్నాడు. అంతకంటే ముందే ఒకరోజు ముందు ప్రీమియర్లు కూడా ప్రదర్శించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు పాటలు మినా షూటింగ్ మొత్తం దాదాపు కంప్లీట్ అయింది ... అక్క‌డ‌క్క‌డ కొంత ప్యాచ్ వర్క్ ఉందని కూడా అంటున్నారు.. ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయింది సెకండ్ హాఫ్ కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్‌ జరుగుతుంది. నవంబర్లో రెండు పాట‌లను తెర‌కెక్కిస్తారుని కూడా అంటున్నారు అందులో ఒక ఐటెం సాంగ్ కూడా ఉంది.

ఇప్పుడు పుష్ప 3 కూడా ఉందని చిత్ర బంధం ముందే చెప్పుకొచ్చింది. పుష్ప 1న్ అవగానే పార్ట్ 2 పై దృష్టి పెట్టారు దర్శకుడు .. అయితే పార్ట్ 3 మాత్రం వెంటనే రాదని అంటున్నారు . మధ్యలో బన్నీ మరో సినిమా , సుకుమార్ మరో సినిమా చేయాలని భావిస్తున్నారు . పార్ట్ 2 చివర్లో పార్ట్ 3 కి సంబంధించిన  ఇంట్రెస్టింగ్ ఓ క్లిప్ హ్యాంగ‌ర్ చూపించబోతున్నారు. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయింది. కే జి ఎఫ్ , సలార్ సినిమాల్లో క్లిప్ హాంగర్స్ పాటు పై మరింత ఆసక్తిని పెంచాయి. పుష్ప2 క్లైమాక్స్ గా కూడా అలాంటి ఉండబోతుంది.

అయితే సుకుమార్ దాన్ని మరో కొత్త పద్ధతిలో డిజైన్ చేశాడని, కాన్సెప్ట్ మొత్తం బ్రహ్మాండంగా సెట్ అయిందని ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ వస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన క్లిప్ హ్యాంగ‌ర్స్ ఒక ఎత్త‌యితే, పుష్ప పార్ట్ 3 మ‌రో ఎత్త‌ని స‌మాచారం.ఐటెమ్ పాట‌లో హీరోయిన్‌గా ఎవ‌ర్ని ఎంచుకోవాలి అనే విష‌యంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. జాన్వీ క‌పూర్, దీప్తి తిమ్రీ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు శ్ర‌ద్దాక‌పూర్ పేరు కూడా ప‌రిశీలిస్తున్నార్ట‌. ఈ నెలాఖ‌రుక‌ల్లా క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది తేలిపోతుంది. న‌వంబ‌రు మొద‌టి వారంలో ఐటెమ్ గీతం చిత్రీక‌ర‌ణ ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: