చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు లాస్ట్ ఛాన్స్.. హెచ్చరించిన మోడీ?
ఈకేవైసీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడం ద్వారా లబ్దిదారుల గుర్తింపును నిర్ధారించుకోవడం, పథకం అమలులో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, 2025 ఏప్రిల్ 30వ తేదీ తర్వాత కూడా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే, రాష్ట్రాలకు ఇచ్చే సబ్సిడీ నిలిచిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది.
అంతేకాక, ఆహార ధాన్యాల కేటాయింపుపై కూడా ఈ వైఫల్యం ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు తమ లబ్దిదారుల ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని, గడువులోపు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.