ఒక హిట్టూ లేదు.. కానీ అవకాశాలు ఆగటం లేదుగా..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ అంటారు.. హిట్ కాంబినేషన్లకు ఎంత విలువ ఇస్తారో.. ప్లాప్ హీరోయిన్ అంటే అంత భయపడతారు.. ఒక్కసారి ప్లాప్‌ హీరోయిన్ అనే ముద్ర తెచ్చుకుంటే ఆ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం ఎంతో కష్టం.. అయితే టాలీవుడ్ లో ఓ హీరోయిన్ కు మాత్రం వరస ప్లాప్‌లు ప‌డుతున్న ఛాన్సులు మాత్రం ఆగకుండా తెచ్చుకుంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇక్కడ చూద్దాం.

ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు కావ్య థాపర్..  2018 ఈ మాయ పేరేమిటి అనే సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది కావ్య.. మొదటి సినిమాతోనే ప్లాఫ్ అందుకున్న ఆ తర్వాత ఏక్ మినీ కథ సినిమాలో మెరిసింది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది.. ఇది హిట్ ప్లాప్‌ అనేది ఎవరూ చెప్పలేరు. అయితే రీసెంట్గా ఆమె నటించిన ఈగల్ , ఊరు పేరు భైరవకాన , డబుల్‌ ఇస్మార్ట్ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. వాటిలో రెండు డిజాస్టర్ గా మిగిలాయి. ఊరు పేరు భైరవకోన యావరేజ్ టాక్‌ తెచ్చుకుంది. ఇక తాజాగా దసరా కానుకగా గోపీచంద్ కు జంటగా విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కూడా కలెక్షన్ వచ్చిన ప్లాప్‌ లిస్టులో చేరిపోయింది. ఇలా ఈ ముద్దుగుమ్మకు ఐరన్ లెగ్ అనే ముద్ర బాగా పడిపోయింది.

అయితే ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు ఆగ‌లేదు. ప్ర‌స్తుతం రెండు కొత్త సినిమాల‌పై సంత‌కాలు చేసింది. తెలుగులో హీరోయిన్‌ల‌ కొర‌త ఏ స్థాయిలో ఉందో చెప్ప‌డానికి కావ్య‌నే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. హీరోయిన్‌లు అందుబాటులో లేక‌పోవ‌డ‌డం ఒక కార‌ణ‌మైతే, గ్లామ‌ర్ డాల్ గా న‌టించ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌క‌పోవ‌డంతో కావ్య‌కు ఎన్నో కొన్ని సినిమాలొస్తున్నాయి. అయితే క‌థేమిటి, త‌న పాత్ర‌కున్న ప్రాధాన్యం ఏమిటి? అనే విష‌యాలపై కావ్య ఇప్ప‌టికైనా దృష్టి పెడితే మంచిది. మ‌రో ఫ్లాప్ త‌గిలితే… త‌న ప్ర‌యాణం డెడ్ ఎండ్ కి వెళ్లిపోతుంది. ఈ విష‌యాన్ని కావ్య లాంటిహీరోయిన్‌లు గుర్తు పెట్టుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: