ఏడిస్తే ఎన్ని లాభాలున్నాయా? అవేంటో చూద్దాం?
మంచి అనుభూతిని కలిగించే ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఓపియాయిడ్లను విడుదల చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు, ఇవి మానసిక, శారీరక భావోద్వేగా బాధను తగ్గించగలవు. కాబట్టి దుఃఖం ఆరోగ్యానికి చాలా అవసరం. నొప్పులు లాంటివి కూడా త్వరగా తగ్గుతాయి. 2014లో జరిపిన అధ్యాయనం ఏడుపు స్వీయ- ఓదార్పు ప్రభావాన్ని చూపుతోందని కనుగొంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థన సక్రియం చేస్తూ.. రిలాక్స్ గా ఉండటానికి సహాయపడుతుందని తెలిపింది. ఓదార్పు మాత్రమే కాకుండా ఇతరుల నుండి మద్దతును పొందడంలో సహాయపడుతుంది. 2011 ఆధ్యాయణం ప్రకారం... ఏడుపు అనేది ప్రధానంగా ఒక అనుబంధ ప్రవర్తన. ఇది మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మద్దతును కూడగట్టుకుంటుంది. ఏడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్నెస్ ఫీలింగ్ ను అందిస్తుంది. కన్నీళ్లు కారడం వల్ల ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ లు విడుదల అవుతాయి. నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కన్నీళ్ళలో లైసోజైమ్ అంతా శక్తివంతమైన యాంటి మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆంత్రాక్స్ వంటి బయోటెర్రర్ ఏజెంట్లు అందించే ప్రమాదాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 2016 అధ్యాయనం పిల్లలు బాగా నిద్రపోవడానికి ఏడుపు సహాయపడుతుందని కనుగొంది. పెద్దవారిపై అదే నిద్రను మెరుగుపరుస్తుందా అనేది ఇంకా పరిశోధన చెయ్యబడలేదు. ఒక వ్యక్తి రెప్ప మూసిన ప్రతిసారి విడుదలయ్యే బేసల్ కన్నీళ్లు, కళ్ళను తేమగా ఉంచడానికి, శ్లేష్మ పొరలు ఎండిపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజి 2023 జర్నల్ ప్రకారం.. బేసల్ కన్నీరు ప్రభావం జనాలు మరింత స్పష్టంగా చూడడానికి సహాయపడుతుంది.