రెండోసారి నమ్మినా కూడా ఆదర్శకులతో ఎన్టీఆర్ కి అలాంటి అనుభవం..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టిఆర్ కెరియర్ లో కొంత మంది తనతో తీసిన సినిమాలతో మొదట ఫ్లాప్ లను అందుకున్న కూడా వారి పని తనం నచ్చి వారికి రెండవ అవకాశం కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ నమ్మకం రెండవ సారి కూడా కొంతమంది దర్శకులు నిలబెట్టుకోలేకపోయారు. మరి ఎన్టీఆర్ తో మొదటి సినిమాతో ఫ్లాప్ అందుకున్న రెండవ సినిమా అవకాశాన్ని ఇచ్చిన దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేని దర్శకులు ఎవరో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లను ఒకరు అయినటువంటి బి గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా బోల్తా కొట్టిన ఈయన పని తనం నచ్చి ఈయనకు జూనియర్ ఎన్టీఆర్ ఈ దర్శకుడికి రెండవ అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో రెండవ సినిమాగా నరసింహుడు అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాగా నమ్మిన దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకరు. ఈయన జూనియర్ ఎన్టీఆర్ తో మొదటగా అశోక్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమా సమయంలో సురేందర్ రెడ్డి పని తనం బాగా నచ్చిన ఎన్టీఆర్ ఆయనకు రెండవ అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఊసరవెల్లి అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బాగానే ఉన్న ఆ సమయంలో ఎందుకు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: