చిరు.. చరణ్ వేసిన ప్లాన్ వారికి బాగా ప్లస్ అయిందిగా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు. ఈ మూవీ బృందం వారు కొద్ది కాలం క్రితం ప్రకటించారు. దానితో ఈ సినిమా విడుదల తేదీకి దగ్గర ఏ మూవీ యూనిట్ తమ విడుదల తేదీలను ప్రకటించలేదు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం విశ్వంభర మూవీ యూనిట్ గేమ్ చేంజర్ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనుకుంటున్నారు. దానితో మా మూవీ విడుదల తేదీని క్యాన్సల్ చేసి మా సినిమా విడుదల తేదీన గేమ్ చేంజర్ విడుదల కాబోతుంది అని ప్రకటనను రిలీజ్ చేశారు. దానితో గేమ్ చేంజర్ విడుదల తేదీకి అనేక సినిమాలు వచ్చి పడ్డాయి.

ప్రస్తుత వార్తల ప్రకారం నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తండెల్ , నితిన్ హీరోగా రూపొందుతున్న రాబిన్ హుడ్ , ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న సారంగపాణి జాతకం సినిమాలను డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో రూపొందిన మ్యాజిక్ మూవీ ని డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా చిరు , చరణ్ విడుదల తేదీలు మారడంతో ఈ నాలుగు మూవీ బృందాలు డిసెంబర్ నెలలోకి ఎంట్రీ ఇచ్చినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: