కొంత మంది హీరోల సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వరుసగా ఓ మూడు సినిమాలకు మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. కొన్ని రోజుల క్రితం తలపతి విజయ్ , వెంకట్ ప్రభూ దర్శకత్వంలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం కష్టం అని చాలా మంది భావించారు.
కానీ ఈ మూవీ మాత్రం సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవడం మాత్రమే కాకుండా భారీ లాభాలను కూడా అందుకుంది. ఇది ఇలా ఉంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కూడా భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం కష్టం అని చాలా మంది భావించారు.
కానీ ఈ మూవీ ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికి కూడా స్టడీగా కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే తమిళ నటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ తాజాగా వెట్టాయన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇలా రీసెంట్ టైమ్ లో ఈ మూడు మూవీలకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీలు మాత్రం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతున్నాయి.