టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న ప్రాజెక్ట్ తండేల్ . రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించగా.. తండేల్ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. తాజాగా తండేల్ సంక్రాంతి బరిలో నిలువబోతుందన్న అప్‌డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరోవైపు రాంచరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న గేమ్ ఛేంజర్ 2025 జనవరి 10న విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్‌తో పోటీ పడటం ఖాయమైపోయినట్టే. మరి తండేల్ రిలీజ్‌పై మేకర్స్
ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కాగా నాగచైతన్య షూటింగ్స్ లేనప్పుడు ఇంతకు ముందు కార్ బైక్ రేసింగ్స్‌లో పాల్గొనేవాడు. ముఖ్యంగా రేస్ కారులను డ్రైవ్ చేయడం అంటే చైతన్యకు మహా ఇష్టం. అయితే గత కొంతకాలం నుండి ఆయన రేసు కారు జోలికి పోవడం లేదట. ఇటీవల నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని తెలియజేశాడు. ”నాకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త రకం బైక్ ఏది కనిపించినా వెంటనే డ్రైవ్ చేయాల్సిందే. సినిమాల్లోకి నా ఎంట్రీ ముందు అంటే జోష్ సినిమా కంటే ముందు ఒక స్పోర్ట్స్ కారు తెప్పించాను. ఏ మాత్రం విరామం దొరికినా ఆ కారుపై షికార్లు కొట్టేవాడ్ని. అయితే
సినిమాలతో బిజీగా మారిన తరువాత స్లోగా ఆ అలవాటు తగ్గించుకోవాలనుకున్నాను. ఎందుకుంటే రేసు కారు అంటే ఎంతటి స్పీడుతో వెళ్లాల్సి వస్తుందో అందరికి తెలిసిన విషయమే. అంత వేగంతో ట్రావెల్ చేయడం మంచిది కాదు అని నా స్నేహితులు, శ్రేయోభిలాషులు చెప్పడంతో దీనితో పాటు నాపై ఇంతమంది నిర్మాతలు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీస్తున్నారు. నేను ఏ మాత్రం ఏమరుపాటుగా వున్న షూటింగ్‌లకు అంతరాయం జరగడంతో పాటు ఆ పొరపాటు నా వ్యక్తిగత జీవితంపై కూడా పడుతుంది. నిర్మాతలకు కూడా నష్టం వాటిల్లుతుంది. అందుకే రేసు కారు అనే ఆలోచన ఇప్పుడు నాలో రావడం లేదు అంటూ చెప్పాడు..!!