ఒకప్పుడు సౌత్ ఇండియాని షేక్ చేసినా సిల్క్ స్మిత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓ స్టార్ హీరోయిన్ మించిన క్రేజ్ ని ఓ నర్తకి దక్కించుకోవడం అదే తొలిసారి. చివరి సారి కూడా. సిల్క్ స్మితకంటే ముందు..తర్వాత ఎంతో మంది డాన్సర్లు వచ్చారు. వెళ్లారు. కానీ సిల్స్ స్మిత అయినంత ఫేమస్ ఎవరూ కాలేకపోయారు. ఇప్పటికీ అదే ఇమేజ్ తో సిల్క్ స్మిత్ బ్రాండ్ ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంటు న్నవారెంతో మంది.ఇదంతా సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే. ఆమె గురించి తెలియని ఎన్నో విషయాలున్నాయి. తాజాగా డిస్కోశాంతి ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి ఆమె గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ తో ఎంతో పాపులారిటీని తెచ్చుకున్న డిస్కో శాంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా 1990 ల కాలంలో కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐటెం సాంగ్స్ తో పాటు పలు సినిమాల్లో నటిగానూ మెప్పించారు. ఇక ఆ తర్వాత రియల్ స్టార్ శ్రీహరిని వివాహం చేసుకున్నారు. కాగా 2013లో శ్రీహరి అనారోగ్య కారణాలతో మరణించగా, అప్పటినుంచి డిస్కో శాంతి కుటుంబం, పిల్లల బాధ్యతను చూసుకుంటున్నారు. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి చెన్నైలోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి సిల్క్ స్మిత పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సిల్క్ స్మిత ఎలా చనిపోయిందని ప్రశ్నించగా తనకు తెలిసినంతవరకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోనే ఆత్మహత్య చేసుకుందని, ఆమె అలాంటి ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో తనకు అర్థం కాలేదన్నారు. ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు తాను ముంబైలో షూటింగ్ లో ఉన్నారంటూ ఆ విషయం తెలవడంతో ఒక్కసారిగా తాను షాక్ గురైననని ఎమోషనల్ అయింది డిస్కో శాంతి.ఈ నేపథ్యంలో తను ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి నాళ్లలో ఆమెకు కలిసి పని చేశానని తెలిపారు. తాను స్మితను అక్కా అని పిలిచేదాన్నీ, తను చాలా మంచిదన్నారు. ఆమె అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుందన్నారు. ఆమె ఎంతో కష్టపడి పైకి వచ్చిందని, కానీ కొంతమంది ఆమెను మోసం చేశారంట షాకింగ్ కామెంట్స్ చేసింది డిస్కో శాంతి.స్మిత భర్త గురించి మాట్లాడుతూ ఆమె ఒక వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుందని, అతనికి అంతకంటే ముందే పెళ్లి పిల్లలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేదని, తాను కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేదాన్ని తెలిపారు.ఇండస్ట్రీలో స్మితకు మంచి గౌరవం ఉండేదని, ఆమె ముందు ఎవరు మాట్లాడడానికి సాహసించే వారు కాదని కనీసం షార్ట్ రెడీ అయిందని చెప్పడానికి కూడా భయపడేవారు అంటూ డిస్కో శాంతి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
సిల్క్ స్మితకు సరిగా డాన్స్ చేయడం రాదని, కానీ.. తన బాడీలో మంచి గ్రేస్ ఉంటుందని, తన గ్లామర్ డ్రెస్సింగ్ తోనే ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుందని చెప్పుకొచ్చారు.ఇదిలావుండగా " అప్పట్లోనే స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. ఒక రోజుకి ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకూ తీసుకునేది. మేము ఆ స్థాయికి చేరుకోవడానికి పదేళ్లు పట్టింది. స్మిత నెలకి ఐదు లక్షలు చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉండేది. సొంత ఇల్లే కొనుక్కోవచ్చు గదా అనే దానిని. నిజానికి ఆమెది చాలా విలాసవంతమైన జీవితం. మంచంపై డబ్బు పరుచుకుని పడుకునేది. "నేను వేషాల కోసం తిరిగినప్పుడు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నేను డబ్బులపై పడుకుంటున్నాను" అని తనే చెప్పింది. సెట్లో తనని చాలా గౌరవంగా చూసేవారు" అని చెప్పారు.