చిన్న డ్రెస్ లో పెద్ద స్ట్రోక్ ఇచ్చిన ప్రగ్యా.. ఈ రేంజ్ లో రెచ్చిపోతే ఇక అంతే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె మిర్చీ ఇలాంటి కుర్రాడు అనే ఓ చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీ కి కూడా తెలుగు పరిశ్రమలో ఈ సినిమా ద్వారా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె కంచే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు భారీగా పెరిగాయి.
 

అవకాశాలు అయితే వచ్చాయి కానీ ఈమెకు అదిరిపోయే రేంజ్ విజయం మాత్రం దక్కలేదు. సూపర్ సాలిడ్ విజయం కోసం ఈమె చాలా సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చింది. కొంత కాలం క్రితం ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తో ఈ బ్యూటీ కి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్.బి.కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అలాగే బాలయ్య , బోయపాటి కాంబోలో రూపొందబోయే అఖండ 2 సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: