యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ , సమంత హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం బృందావనం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా 2010 సంవత్సరం అక్టోబర్ 14 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 14 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమాకు టోటల్ బాక్స్ ఆఫీస్ అని ముగిసే సరికి నైజాం ఏరియాలో 8.30 కోట్ల కలెక్షన్లు రాగా , సీడెడ్ ఏరియాలో 6.54 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.95 కోట్లు , ఈస్ట్ లో 1.60 కోట్లు , వెస్ట్ లో 1.56 కోట్లు , గుంటూరు లో 2.73 కోట్లు , కృష్ణ లో 1.83 కోట్లు , నెల్లూరు లో 1.30 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకి 26.81 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్లలో కలుపుకొని 3.52 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 30.23 కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీకి 24.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 30.23 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టింది. దానితో ఈ సినిమా ద్వారా బయ్యర్లకు 5.53 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇలా ఆ సమయంలో ఈ సినిమా మంచి లాభాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.