నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా ను ఎన్బికే 109 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ చిత్రీకరిస్తున్నారు . ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయను న్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు . బాలయ్య కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిం దే. భారీ అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుం ది.
ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 మూవీ ని రూపొందించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. రేపు అనగా అక్టోబర్ 16 వ తేదీన అఖండ 2 మూవీ కి సంబంధించిన ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొద్ది గంటల్లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడం , బాలయ్య , బోయపాటి కాంబోలో రూపొందిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ కావడంతో అఖండ 2 మూవీ మొదలు కాకముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా టీజర్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.