ఒక 10 , 12 సంవత్సరాల వెనక్కు వెళ్లినట్లు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే తక్కువ టికెట్ ధరలకు పెట్టింది పేరు. దానితో ప్రతి పేదవాడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చే సినిమాలు చూడడానికి ఎగబడేవారు. ఎందుకు అంటే రోజంతా కష్టపడిన వారు వారం చివరన ఒక సినిమా చూసి ఆనందపడాలి అనుకునేవారు. అలాగే వారు కష్టపడిన దాంట్లో చాలా తక్కువ మొత్తం తోనే సినిమా చూసే వేసులుబాటు ఉండటంతో అనేక మంది పేదవాళ్లు , కూలి పని చేసుకునేవారు వారంలో ఒక సినిమా అయినా చూడాలి అని అనుకునేవారు. దానితో చిన్న చిన్న సినిమాలు కూడా అద్భుతమైన కలక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు దాదాపుగా తెలుగు సినీ పరిశ్రమలో లేవు. స్టార్ హీరోలు నటించిన సినిమాలను ఒక పేదవాడు చూడాలి అనుకుంటే దాదాపు అతను రెండు , మూడు రోజుల కష్టాలు మొత్తాన్ని పెట్టినా కానీ ఒక సినిమా చూసే పరిస్థితులు లేవు. స్టార్ హీరోలకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్లు ఇవ్వడం , అలాగే డైరెక్టర్లకు కూడా అదే స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడం. ఇక ఇతర టెక్నీషియన్లకి , నటీనటులకు కూడా భారీ మొత్తంలో పారితోషకాలు ఇవ్వడం ఇవన్నీ ఇచ్చాక వందల కోట్ల బడ్జెట్లో అయ్యాయి సినిమాకు అని చెప్పి టికెట్ ధరలను అమాంతం పెంచేయడం దీని ద్వారా టికెట్ ధరలు భారీగా ఉండడంతో ఒక పేదవాడు , కూలి పని చేసుకునేవాడు సినిమా థియేటర్‌కు వెళ్లే అవకాశాలే లేకుండా అయిపోయాయి అని అనేకమంది జనాలు అభిప్రాయపడుతున్నారు.
దానితో వీరంతా ఏం చేయాలి? వారు వారంలో కష్టపడిన మొత్తం సొమ్మును పెట్టి ఒక సినిమా చూడాలా... లేక చౌక ధరకు వస్తున్న ఇంటర్నెట్ ద్వారా సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూడాలా అనే ప్రశ్నను జనాలు లేవనెత్తుతున్నారు. చాలా మంది పేదవాళ్లు అందుకే ఇంటర్నెట్లో సినిమాలు డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని జనాలు అభిప్రాయపడుతున్నారు. టికెట్ ధరలు భారీగా ఉండడంతోనే పేదవాడు mvieruz , iboma వెంట పడుతున్నట్లు కూడా జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికైనా తెలుగు సినీ పరిశ్రమ కోలుకొని ప్రతి పేదవాడికి అతి తక్కువ టికెట్ ధరతో సినిమాను తీసుకు వెళ్లగలిగితే టాలీవుడ్ ఇండస్ట్రీ మరింత పురోగతి చెందుతుంది అని చాలా మంది జనాలు అభిప్రాయపడుతున్నారు.