తెలుగు సినీ పరిశ్రమ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటు వంటి దిల్ రాజు కెరియర్ ప్రారంభంలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు . ఇక ఆ తర్వాత ఈయన సినిమాలను నిర్మించడం మొదలు పెట్టి నిర్మాణ రంగం లో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే దిల్ రాజు అనేక ఇంటర్వ్యూ లలో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సమయంలో అనేక ఎత్తు పల్లాలను చూసినట్లు , ఎన్నో సందర్భాలలో నష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇకపోతే నిర్మాణ రంగం లోకి వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాలలో డిస్ట్రిబ్యూషన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నట్టు చెప్పుకొచ్చాడు. తాజాగా దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా దిల్ రాజు కు మీరు నిర్మాణ రంగం లోకి వచ్చిన తర్వాత ఏదైనా సినిమా ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నారా ..? అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ ... నిర్మాణ రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆర్య మూవీ ని రూపొందిస్తున్నాను.
ఆ సమయం లో తేజ దర్శకత్వంలో రూపొందిన జై సినిమాను దాదాపు 2.25 కోట్లకు కొనుగోలు చేశాను. ఆ సినిమా ద్వారా దాదాపు రెండు కోట్ల రూపాయలు పోయాయి. ఆ తర్వాత ఆర్య సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. దాని ద్వారా డబ్బులు మొత్తం రికవరీ అయ్యాయి అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.