ఏంటి నిజంగానే విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారా.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహగానాల్లో ఉన్న నిజమెంతా.. ఇంతకీ ఈ విడాకుల వార్తలు పుట్టుకు రావడానికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. విరాట్ కోహ్లీ అనుష్క దంపతులను విరుష్క జంట అని ప్రేమగా పిలుచుకుంటారు వీరి అభిమానులు.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో కోహ్లీకి ఒక చెరిగిపోని గుర్తింపు ఉంది. ఈయన పేరు చెబితే తెలియని వారు ఉండరు. అలా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను తన క్రికెట్ ఆటతో మెప్పించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా పలు వ్యాపార ప్రకటనల్లో కూడా నటించి మరింత ఫేమస్ అయ్యాడు. ఇక అలాంటి విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి అనుష్క శర్మ తో ప్రేమలో పడి ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఒక పాప బాబు కూడా జన్మించారు. అయితే అలాంటి ఈ జంట తాజాగా విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు ఊపందుకున్నాయి.
అయితే ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీ జంటలు విడిపోతున్నట్టు రూమర్లు ముందుగా వస్తున్నాయి. కానీ ఆ తర్వాత సెలబ్రిటీలు ఈ విడాకుల రూమర్లను నిజం చేస్తున్నారు.ఈ మధ్యకాలంలోనే ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటాషాలు విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. వీళ్లిద్దరి బంధం మీద కూడా ఎన్నో రూమర్లు వినిపించాయి. అలా చివరకు ఆ రూమర్లనే నిజం చేస్తూ వీరిద్దరూ విడాకులు ప్రకటించారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ కుప్పలు తెప్పలుగా చక్కర్లు కొడుతున్నాయి. దానికి ప్రధాన కారణం రీసెంట్ గా విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు ఇద్దరు ఒకరిపై ఒకరు హేళన చేసుకునే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు.ఇక ఈ పోస్టులు చూసిన చాలా మంది జనాలు ఇదేంటి ఇద్దరు భార్య భర్తలు ఒకరిని ఒకరు కించపరుచుకున్నట్టు పోస్టులు పెట్టారు.
ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక ఈ విషయం వైరల్ అయిన కొద్దిసేపటికి మరికొంతమంది జనాలు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు విడాకులు తీసుకోబోతున్నారని, అందుకే ఒకరిని ఒకరు అవమానించుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ చేశారు.దీంతో అనుష్క శర్మ విరాట్ కోహ్లీల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.ఇక ఈ వార్తలు విన్న అభిమానులు కొట్టి పారిస్తుంటే మరికొంత మందేమో ఇంత అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు.మరి ఈ విడాకుల వార్తలపై ఇప్పటివరకైతే ఈ జంట స్పందించలేదు ఒకవేళ స్పందిస్తే ఎలా రియాక్ట్ అవతారో చూడాలి