24 ఏళ్ల నువ్వే కావాలి.. ఎంతకు అమ్మితే ఎంత వచ్చిందో తెలుసా.. అప్పట్లో రికార్డ్..?

Pulgam Srinivas
తరుణ్ హీరోగా రీచా హీరోయిన్గా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నువ్వే కావాలి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2000 సంవత్సరం అక్టోబర్ 13 వ తేదీన మంచి అంచనాల నడమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 24 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 7.35 కోట్ల కలెక్షన్లను రాబట్టగా , సీడెడ్ ఏరియాలో 2.80 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.79 కోట్లు , ఈస్ట్ లో 1.43 కోట్లు , వెస్ట్ లో 1.27 కోట్లు , గుంటూరు లో 1.56 కోట్లు , కృష్ణ లో 1.33 కోట్లు , నెల్లూరులో 86 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18.39 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ లో కలుపుకొని ఈ మూవీ కి 81 లక్షలు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 19.20 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే నువ్వే కావాలి సినిమాకి 1.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 19.20 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా తరుణ్ , రీచా కు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. కోటి ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా ... ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ సినిమాను నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంభాషణలు అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: