చరిత్రలో నిలిచిపోయేలా బాలకృష్ణ- కృష్ణ మధ్య గొడవ.. కట్ చేస్తే..!

Divya
సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ కలయికలలో చాలా చిత్రాలు వచ్చాయి.. ముఖ్యంగా అప్పట్లో నటీనటులు చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయంలో కూడా అటు కృష్ణాకి ఎన్టీఆర్కి మధ్య విభేదాలు చాలా పెరిగిపోయాయట. అల్లూరి  సీతారామరాజు సినిమా దగ్గర నుంచి అటు ఎన్టీఆర్, కృష్ణ  మధ్య తీవ్రమైన వివాదాలు రెండు కుటుంబాల మధ్య వైర్యానికి దారితీసిందట. అంతేకాకుండా బాలయ్య, కృష్ణ మధ్య కూడా ఒక సంఘటన చోటు చేసుకుందని.. ఈ సంఘటన రెండు కుటుంబాల అభిమానులు చరిత్రలో మరిచిపోలేరట. వాటి గురించి చూద్దాం.

అటు ఘట్టమనేని ఇటు నందమూరి కుటుంబాల మధ్య టైటిల్ విషయంలో ఒక వివాదం చోటు చేసుకున్నరట. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మొదటిసారిగా 1987న ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కృష్ణ పెద్ద కుమారుడు ఎంట్రీ కోసం కృష్ణ బేతాబ్ అనే ఒక సినిమా హిందీ రైట్స్ ని కూడా కొనుగోలు చేశారట. ఈ చిత్రానికి సామ్రాట్ అనే టైటిల్ని కూడా అనుకున్నారు. అలాంటి సమయంలో బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్లో కూడా సామ్రాట్ అనే టైటిల్ తో సినిమాలు అనౌన్స్మెంట్ చేశారు. అలా బాలయ్య కృష్ణ మధ్య టైటిల్లో వివాదం చోటు చేసుకున్నదట.

అయితే అప్పటికి ఎన్టీఆర్ ,కృష్ణ మధ్య విభేదాలు ఉండడంతో ఇటు బాలయ్య, కృష్ణ ఎవరు కూడా ఈ విషయం పైన తగ్గలేదట. ఈ విషయం పైన కృష్ణ ఏకంగా కోర్టుకే వెళ్లడం జరిగిందట. చివరికి కోర్టు కూడా ఈ సినిమా టైటిల్ ని సామ్రాట్ టైటిల్ హక్కులు కృష్ణకే ఉంటాయని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత బాలయ్య ఆ సినిమాకి సాహస సామ్రాట్ అనే టైటిల్ని మార్చుకోవడం జరిగింది. అయితే అంతలా తన కుమారుడి కోసం ఇబ్బందులు పడ్డ కృష్ణ తన కుమారుడు రమేష్ బాబు మాత్రం స్టార్ హీరో కాలేకపోయారు. కానీ మహేష్ నటించిన కొన్ని చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా పనిచేసే సక్సెస్ అయ్యారు. 2022లో రమేష్ బాబు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: