బాలయ్యకు గ్లోబల్ ఇమేజ్.. దీని వెనుక ఆయన హస్తం ఉందా..?

Divya
ఆహా లో సక్సెస్ఫుల్గా కొనసాగిన హిట్ టాక్ షో అన్ స్టాపబుల్ Nbk నాలుగవ సీజన్ కు సంబంధించి ఇటీవల అప్డేట్ ఇస్తూ ఒక త్రీడి యానిమేటెడ్ ప్రోమోన్ కూడా విడుదల చేశారు. ఈ సీజన్లో బాలయ్య సరికొత్తగా సూపర్ హీరోగా కనిపించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ అతిధులు అనిల్ రావిపూడి, అజిత్ ఠాగూర్, అల్లు అరవింద్, నందమూరి తేజస్విని, రవికాంత్ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆహా సంస్థ ఈ సీజన్ గురించి ప్రేక్షకులు ఎలాంటి కొత్త అంశాలను సైతం రాబోతాయో అనే విషయాన్ని కూడా వివరించారు.

బాలయ్య సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ల సినీ ప్రస్థానం చేసుకున్న సందర్భంగా  బాలయ్య ఎన్నో చిత్రాలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారని.. బాలయ్య ఎంతో ప్రభావితమైన కథానాయకుడుగా పేరు పొందాలరని అక్కడ ఉన్న వారందరూ తెలియజేశారు. ఇక బాలయ్య చిన్న కూతురు తేజస్విని తన తండ్రిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ.. అన్ స్టాపబుల్  సీజన్ 4వ ప్రోమోను రిలీజ్ చేయించింది. ఇందులో బాలయ్య సూపర్ హీరో గా కనిపించబోతున్నారు.

ఈ సీజన్ కచ్చితంగా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని.. అదిరిపోయే సర్ప్రైజ్లు కూడా ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత బాలయ్య మాట్లాడుతూ.. ఈ షో తర్వాత చాలామంది తనని ఇతర షోలకి హోస్టుగా చేయమని అడిగారని కానీ తాను మాత్రం అసలు ఒప్పుకోలేదని తెలిపారు.. ఈ షో చేయడానికి ముఖ్య కారణం అల్లు అరవిందేనని.. ఆయన అడగడం వల్లే తాను ఒప్పుకున్నానని తెలిపారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె టీం మొత్తం కృషి వల్లే.. ఇది సక్సెస్ అయ్యిందని నమ్ముతున్నానని తెలిపారు. అలాగే ఇది IMDB లో 18వ ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అన్ ష్టాపబుల్ షో మొదలుపెట్టినప్పటి నుంచే దేశంలోనే అతిపెద్ద టాక్ నిలిచిందని.. ఇప్పటికే చాలామంది అతిధులు వచ్చారు.. ఈ సీజన్ మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది అంటూ తెలిపారు. అయితే బాలయ్య కు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ పెరగడం వెనుక ఈ ఆన్ స్టాపబుల్ షో కూడా ఉన్నది.. కనుక బాలయ్య రేంజ్ పెరగడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: