కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. బారి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా మొదలు కాకముందు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయట.
ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బి గోపాల్ ఈ మూవీ స్టార్ట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా గోపాల్ మాట్లాడుతూ ... ఇంద్ర సినిమా కోసం చిన్ని కృష్ణ దగ్గర ఉన్న ఒక కథను తీసుకున్నాం. ఆ కథ లో మొదటగా చిరంజీవి గోదావరి బ్యాక్ డ్రాప్ ను జీవిస్తాడు. ఇక ఆ బ్యాక్ డ్రాప్ మాకు పెద్దగా నచ్చలేదు. దానితో కొన్ని చర్చలు జరిపాము. ఇక ఆ తర్వాత గోదావరి బ్యాక్ డ్రాప్ లో కాకుండా ఈ సినిమాను కాశి బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనను మూవీ బృందం వ్యక్తం చేసింది.
దానితో వెంటనే చిన్ని కృష్ణ కూడా ఇంద్ర సినిమా కథను గోదావరి బ్యాక్ డ్రాప్ నుండి కాశి బ్యాక్ డ్రాప్ కు మార్చాడు. అలాగే స్క్రీన్ ప్లే లో కూడా అనేక మార్పులు , చేర్పులు చేశాము అని బి గోపాల్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలోని మెగాస్టార్ చిరంజీవి నటనకు , అలాగే ఈ మూవీ ని తీర్చి దిద్దిన బి గోపాల్ దర్శకత్వానికి ఆ సమయంలో అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి లభించాయి.